3న విశాఖలో ప్రపంచ విండ్ ఉత్సవ్

కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడి
వన్‌టౌన్ :
విశాఖలో ప్రపంచ విండ్ ఉత్సవ్‌ను డిసెంబరు 3న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. విండ్ ఉత్సవ్ ఏర్పాట్లపై పర్యాటక శాఖ అధికారులతో పాటు ఉత్సవ్ నిర్వాహకులతో కలెక్టర్ మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాద సంగీత విద్వాంసులంతా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రోజంతా భిన్న రకాల ఫ్లూట్ వాయిద్యాలతో అలరించనున్నారని తెలిపారు. రుషికొండ వద్దనున్న వి.కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రముఖ ఫ్లూట్ విద్వాంసులు హరిప్రియ చౌరాసియా వంటి దిగ్గజాలు హాజరవుతున్నందున, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూఇంచారు. విశాఖను సంగీత రాజధానిగా మార్చేందుకు ప్రతీ నెలా ఏదో ఒక సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారి శ్రీరాములునాయుడు, విండ్ ఉత్సవ్ నిర్వాహకులు నరేష్, కౌసిక్ ముఖర్జీ, తదితరులు పాల్గొన్నారు.