A visit to the training IASs vPetee

శిక్షణ ఐఏఎస్‌ల వీపీటీ సందర్శన

A visit to the training IASs vPetee
శిక్షణ ఐఏఎస్‌లతో సమావేశమైన వీపీటీ ఛైర్మన్ రామ్మోహనరావు
మహారాణిపేట: శిక్షణలో ఉన్న ఐఏఎస్‌ల బృందం శనివారం విశాఖ ఓడరేవును సందర్శించింది. వీరితో పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు సమావేశమయ్యారు..పోర్టులో జరుగుతున్న కార్యకలాపాలు, వ్యాపారాభివృద్ధి, ఎగుమతులు, దిగుమతులు, మౌలిక వసతులు, యాంత్రీకరణ, ఆధునికీకరణ తదితర అంశాలను ఆయన వివరించారు.
అనంతరం సివిల్ సర్వీస్ ఎంపిక చేసుకునేందుకు కారణాలు, ప్రేరణ ఎవరు, విద్యార్హతలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి బృందం సభ్యులు పోర్టులోని పలు విభాగాలకు వెళ్లి వాటి పని తీరును పరిశీలించారు.