News

Realestate News

Visakhapatnam constituency voting 2014 and 2019 differences

In Vishakha Lok Sabha constituency, the polling percentage was reduced by 4.71 per cent.


విశాఖ లోక్‌సభ పరిధిలో తగ్గిన ఓటింగ్‌

In Vishakha Lok Sabha constituency, the polling percentage was reduced by 4.71 per cent.

విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 2014తో పోల్చితే 4.71 శాతం మేర పోలింగ్‌ తగ్గింది. నియోజకవర్గ పరిధిలో నగరంలో ఉన్న నాలుగు సెగ్మెంట్లతో పాటు గాజువాక, భీమిలి, ఎస్‌కోట నియోజకవర్గాలు వస్తాయి.

మొత్తం ఏడు సెగ్మెంట్ల పరిధిలో 18,25,769 ఓట్లు ఉన్నాయి. వీరిలో 67.26 శాతం మంది అంటే 12,28,070 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు- 607034, మహిళలు-621028, ఇతరులు-8 మంది ఉన్నారు.

ఎస్‌కోటలో అత్యధికంగా 85.69 శాతం, భీమిలి-73.90, విశాఖ తూర్పు-64.73, విశాఖ దక్షిణ-61.15, విశాఖ ఉత్తర-62.65, విశాఖ పశ్చిమ-58.43, గాజువాక65.33 శాతం మంది ఓటు వేశారు.

లోక్‌సభ పరిధిలో కూడా మహిళలు 13,994 మంది అదనంగా ఓట్లు వేశారు.

అనకాపల్లి లోక్‌సభలో 81 శాతం

అనకాపల్లి లోక్‌సభ పరిధిలో 81 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దీని పరిధిలోకి పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, మాడుగల సెగ్మెంట్లు వస్తాయి. మొతం ఓటర్లు 15,17,497 మందికాగా..

పురుషులు-604225, మహిళలు-624876, ఇతరులు-6 వెరసి 12,29,107 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ సైతం 20,651 మంది మహిళా ఓటర్లే అధికంగా ఓటు వేశారు.

*  అరకు లోక్‌సభ పరిధిలోకి వచ్చే పాడేరు, అరకుల్లో 66.07 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

447815 మంది ఓటర్లు ఉంటే వీరిలో పురుషులు-148515, మహిళలు-147336, ఇతరులు2 వెరసి 295853 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo