ఆర్ట్స్ కళాశాల జర్నల్ ఆవిష్కరణ

ఆర్ట్స్ కళాశాల జర్నల్ ఆవిష్కరణ
VISA ACHARYA G. Nageswara Rao doing arts college journal

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం ఈనెల 26వ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తెలిపారు.
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వైవిఎస్మూర్తి ఆడిటోరియంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నామన్నారు. వర్సిటీలో 80 ఏళ్లు పైబడిన విశ్రాంత ఆచార్యులు 16 మంది, అధ్యాపకేతర సిబ్బంది 14 మందిని ఈ కార్యక్రమంలో సత్కరిస్తున్నట్లు తెలిపారు.
ఆరేళ్లలో యూనివర్సిటీలో వందేళ్లు పూర్తిచేసుకోనున్నందున సీనియర్ విశ్రాంత ఆచార్యులు ఎ.ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశామన్నారు.
ఏయూ పుట్టుక, పుట్టుకకు దారితీసిన కారణాలు, అప్పటి విషయాలు సహా ఏయూకు సంబంధించిన ఈ వందేళ్ల చరిత్రను తవ్వి రూపొందించేందుకు ఈ కమిటీ రేడియో కేంద్రంతో పాటు పలు గ్రంథాలయాల్లో నిక్షిప్తమైన పత్రికలు తదితర విషయాలు సేకరిస్తుందని తెలిపారు.