Posted on June 29, 2019 by Mohan Manikanta in Realestate News
ఉన్నత విద్యకు బాటలువేసిన విక్రమదేవ్ వర్మ
ఏయూలోని రాజా విక్రమదేవ్ వర్మ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న వీసీ
ఆచార్య జి.నాగేశ్వరరావు, ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తదితరులు
విశాఖను విద్యా నగరంగా తీర్చిదిద్దడానికి మహారాజా విక్రమ్దేవ్వర్మ విశేష కృషిచేశారని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు.
శుక్రవారం ఉదయం ఏయూలో రాజా విక్రమ్దేవ్వర్మ 150వ జయంతి పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఏయూ భౌతిక శాస్త్ర విభాగంలోని విక్రమ్దేవ్వర్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఏయూ సైన్స్ కళాశాల స్థాపనకు ఆద్యునిగా ఆయన నిలిచారన్నారు. ఆయన అందించిన సేవలను వర్సిటీ పుస్తకరూపంలో ముద్రిస్తుందన్నారు.
కార్యక్రమంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ మాట్లాడుతూ విజయవాడలో ఏర్పాటుచేసిన ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నం తీసుకురావడంలో విక్రమ్దేవ్వర్మ కృషిచేశారన్నారు.
విద్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో తనదైన ముద్రవేశారన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్, ఇన్కంటాక్స్ చీఫ్ కమిషనర్ సి.ఆర్.పతి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఏయూ టి.ఎల్.ఎన్ సభామందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జైపూర్ రాజవంశస్థురాలు మయాంక కుమారి దేవ్ కూడా ప్రసంగించారు. సాహితీ వేత్త డాక్టర్ డి.వి.సూర్యారావు మాట్లాడుతూ విక్రమ్ దేవ్ వర్మ తెలుగు, సంస్కృత భాషల్లో పలు రచనలు చేశారన్నారు.
ఆయనపై తీర్చిదిద్దిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. విక్రమ్ దేవ్ వర్మ 150వ జయంతిని పురష్కరించుకొని ఏర్పాటుచేసిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళింగ ఒడియా అకాడమి సభ్యులు పాల్గొన్నారు.
Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399