గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విజయలక్ష్మి

గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విజయలక్ష్మి

బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మిని అభినందిస్తున్న నర్సుల సంఘం ప్రతినిధులు
కింగ్‌జార్జి ఆసుపత్రి గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా జె.విజయలక్ష్మి గురువారం బాధ్యతలు చేపట్టారు.
ఇంతవరకూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ పదోన్నతిపై విశాఖకు బదిలీ అయ్యారు.
బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మిని గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్ లక్ష్మీకుమారి, ఇతర అధికారులు అభినందించారు.
అనంతరం ఆమె ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ అర్జునను కలిశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, డాక్టర్ విజయశంకర్, డాక్టర్ దొర తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మిని నర్సుల సంఘం సత్కరించింది. సంఘం అధ్యక్షురాలు పి.వరలక్ష్మి, ఇతర ప్రతినిధులు బేబి, శాంతమ్మ, డి.రాజేశ్వరి, సుజాత, రవీంద్ర, మమత, భవాని, సంఘం మాజీ అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి, ఈఎన్టీ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్తేరు తదితరులు అభినందించారు.