గ్రామీణ నిరుద్యోగ యువతకు శిక్షణ

వెలుగు-ఈ.జి.ఎం.లో భాగంగా 19 నుంచి 26 సంవత్సరాల వయస్సుగల గ్రామీణ నిరుద్యోగ యువతకు ఇంగ్లీష్ వర్క్డ్నెస్ అండ్ కంప్యూటర్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించి, ఉపాధి కల్పించనున్నట్లు డి.ఆర్.డి.ఎ. పి.డి. సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫారం అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గలవారంతా 94917 92627 ఫోన్ నెంబరులో సంప్రదించాలని కోరారు.
ఫార్మసీ రంగంలో…
వెలుగు-ఈ.జి.ఎం.లో భాగంగా దీనదయాల్ ఉపాధ్యాయ, గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు కలిగి, పది, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన యువతకు డి.ఆర్.డి.ఎ., అపోలో మెడీస్కిల్స్ లిమిటెడ్ ద్వారా ఫార్మసీ రంగంలో ఫార్మసీ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డి.ఆర్.డి.ఎ. పి.డి. సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫారం అందిస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు 94922 57180 ఫోన్ నెంబరులో సంప్రదించాలని కోరారు.