News

Realestate News

ఉద్యోగులకు ముగిసిన శిక్షణ

Training employees Over thousand people two installments.

ఉద్యోగులకు ముగిసిన శిక్షణ

 రెండు విడతల్లో వెయ్యిమందికిపైగా అవగాహన


శిక్షణలో పాల్గొన్న ఉద్యోగులు

ఓట్ల గణనకు నియమితులైన పర్యవేక్షకులు, సహాయకులకు గత నాలుగురోజులుగా యంత్రాంగం నిర్వహిస్తోన్న శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పోలైన ఓట్లను లెక్కించేందుకు 420 టేబుళ్లు ఏర్పాటుచేస్తున్నారు.

వీటితో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించడానికి మరో 12 బల్లలు పెట్టనున్నారు. లెక్కింపు సమయంలో ఒక్కో బల్లకు ఒక సూపర్‌వైజర్‌, సహాయకుడు కలిపి ఇద్దరిని నియమిస్తున్నారు.

సూక్ష్మ పరిశీలకునిగా మరొకరిని నియమిస్తున్నారు. మొత్తంగా బల్లకు ముగ్గురు చొప్పున సిబ్బంది ఉండనున్నారు. తొలి విడతలో ఈనెల 15, 16, 18, 19 తేదీల్లో లెక్కింపునకు నియమితులైన పర్యవేక్షకులు, సహాయకులకు శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు ఏఈవోలు, ఇతర సిబ్బందికి కలిపి వెయ్యిమంది వరకు అవగాహన కల్పించారు.

కలెక్టర్‌ భాస్కర్‌, జేసీ సృజనలతో పాటు ఇతర అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగింది. పోలింగ్‌ రోజున దొర్లిన తప్పిదాలు లెక్కింపు సమయంలో చోటుచేసుకోకూడదనే ఉద్దేశంతో యంత్రాంగం ఒకటికి రెండు సార్లు లెక్కింపు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.

లెక్కింపునకు సంబంధించి ప్రతీ అంశాన్ని లెక్కింపు సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. రెండు విడతల్లో మొత్తం నాలుగు రోజుల్లో దాదాపు వెయ్యిమందికి అవగాహన కల్పించారు. సూక్ష్మపరిశీలకులుగా నియమితులయ్యే దాదాపు 450 మందికి సోమవారం అవగాహన కల్పించనున్నారు.

ఈసారి ఈటీపీబీఎస్‌ ఓట్ల స్కానింగ్‌, వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపునకు అనుసరించాల్సిన పద్ధతులను తెలియజేయనున్నారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo