News

Realestate News

పర్యాటకం.. ప్రగతిబాట పట్టేనా?

పర్యాటకం.. ప్రగతిబాట పట్టేనా?

ప్రాజెక్టుల ప్రగతిపై నేడు కలెక్టర్‌ సమీక్ష

ఇటీవల జరిగిన కార్యక్రమాలపై ఆరా?

ఈనాడు, విశాఖపట్నం : రాష్ట్రంలో విశాఖకు పర్యాటకం పరంగా మంచి గుర్తింపు ఉంది. నగరంలోని సందర్శనీయ ప్రాంతాలతో పాటు అరకు, లంబసింగి వంటి గిరిజన కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ఇక్కడకు వస్తున్న వారు అధికంగానే ఉంటున్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. మరెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ ఈ శాఖ తీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించారు.

జిల్లాలోని పర్యాటక శాఖతో సంబంధం ఉన్న అన్ని విభాగాల అధికారులతో ఆయన కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం సమావేశం అవుతున్నారు. ప్రస్తుత పనుల ప్రగతి, ఇటీవల రూ.7.5 కోట్లతో నిర్వహించిన విశాఖ ఉత్సవాలతో పాటు అరకులో నిర్వహించిన బెలూన్‌ ఉత్సవాలపై వచ్చిన విమర్శలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
పర్యాటక శాఖ చేపడుతున్న ప్రాజెక్టులు, నిధుల విడుదల, జరుగుతున్న పనులు, తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌ భాస్కర్‌ ఆ శాఖ అధికారులతో చర్చించనుండడంపై ఆసక్తి నెలకొంది. గత ఏడాది డిసెంబర్‌ 28, 29, 30 తేదీల్లో జరిగిన విశాఖ ఉత్సవ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి ప్రభుత్వం రూ.3.5 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసంలో అరకులో నిర్వహించిన బెలూన్‌ ఉత్సవాలదీ అదే తీరు. ఇది కేవలం నిర్వాహకుల కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం మాదిరి జరిగిన తీరుపై స్థానిక మంత్రి నుంచి అన్ని వర్గాల వరకు వ్యతిరేకత వ్యక్తమైంది.

వీటన్నింటిపై ఇప్పటికే ప్రాథమిక సమాచారం అందడంతో నిర్వాహక సంస్థ బాధ్యులను సైతం కలెక్టర్‌ పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. గత ఏడాది నిర్వహించిన యాచింగ్‌ ఫెస్టివల్‌ పూర్తిస్థాయిలో జరగకపోయినప్పటికీ రూ.4 కోట్ల బిల్లులు చెల్లించడంపైనా అనుమానాలు వ్యక్తమవ్వడం, మళ్లీ అదే సంస్థకు మార్చిలో యాచింగ్‌ ఫెస్టివల్‌ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పడంతో పూర్తిస్థాయి వివరాలు, ఎలా నిర్వహిస్తారో ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

ప్రాజెక్టులపై…
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు కీలక ప్రాజెక్టులు జిల్లాలో జరుగుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు వేగవంతమవ్వాల్సి ఉంది. అరకు, అనంతగిరి, నగర పరిధిలో జరుగుతున్న ప్రాజెక్టులపై దీనిలో చర్చించనున్నారు. చాలా పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులైన మూత్ర శాలలు, తాగునీటి వసతి లేకపోవడం అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు.

బౌద్ధ సందర్శన ప్రాంతాలు, ఇతర వాటికి పురావస్తు శాఖతో సంబంధం ఉండడంతో ఆ శాఖ అధికారులను పిలిపించి అక్కడ వసతుల కల్పనపైనా చర్చించనున్నారు. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని ప్యాకేజీలు నడుస్తున్నాయి. మరికొన్ని ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తే ఎలా ఉంటుందనేది ఆ శాఖ అధికారులు కలెక్టర్‌ ముందు ఉంచనున్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo