News

Realestate News

నేటి నుంచి ప్రథమ డి.ఎల్‌.ఇ.డి. పరీక్షలు

Today onwards, first DMED Exams starts.


నేటి నుంచి ప్రథమ డి.ఎల్‌.ఇ.డి. పరీక్షలు


భీమిలి సెయింట్‌ ఆన్స్‌ హైస్కూలు పరీక్ష కేంద్రం

 డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డిఎల్‌ఇడి) ప్రథమ సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం నుంచి 10వ తేదీ వరకు 11 కేంద్రాల్లో నిర్వహించాలని విద్యాశాఖాధికారులు నిర్ణయించారు.

భీమిలి ప్రభుత్వ హైస్కూలు, భీమిలి సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ హైస్కూలు, ఆనందపురం జెడ్పీ హైస్కూలు, చోడవరం జెడ్పీ బాలికల హైస్కూలు, నర్సీపట్నం ఎం.జి.ఎం.హైస్కూలు, నర్సీపట్నం జెడ్పీ హైస్కూలు, గాజువాక జెడ్పీ హైస్కూలు, పెందుర్తి జెడ్పీ హైస్కూలు, నక్కపల్లి జెడ్పీ హైస్కూలు, సబ్బవరం ప్రభుత్వ హైస్కూలు, సబ్బవరం ఎ.పి.ఎస్‌.డబ్ల్యు.ఆర్‌.స్కూళ్లని పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు.

భీమిలి సెయింట్‌ ఆన్స్‌ హైస్కూలు కేంద్రానికి 200 మంది, ప్రభుత్వ హైస్కూలు కేంద్రానికి 160 మందిని కేటాయించారు. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్ష జరుగుతుంది.

భీమిలి ప్రభుత్వ హైస్కూలు పరీక్ష కేంద్రం చీఫ్‌ జి.వెంకటరావు మాట్లాడుతూ ఛాత్రోపాధ్యాయులు అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

వేసవి దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు.