Posted on July 30, 2019 by Mohan Manikanta in Realestate News
పరీక్షల విభాగంలో ఆలస్యం జరగరాదు
సమావేశంలో మాట్లాడుతున్న వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి
పరీక్షలు ముగిసిన 28 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయాలని.. భవిష్యత్తులో 14 రోజుల్లోనే అందించే దిశగా పనిచేయాల్సి ఉంటుందని ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.
సోమవారం ఆయన ఏయూ పరీక్షల విభాగం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. పరీక్షల విభాగంలో ఆలస్యం జరగకూడదన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తుచేసిన విద్యార్థుల ఫలితాలను అందించడానికి స్పెషల్ డ్రైవ్ మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు వీసీ పేర్కొన్నారు.
అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకటరావు పర్యవేక్షణలో మూల్యాంకనం జరుగుతుందన్నారు. పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు మార్కులు తెలియజేయాలని పరీక్షల విభాగం అధికారులు కోరగా.. వీసీ సానుకూలంగా స్పందించారు.
సమావేశంలో అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకటరావు, డీన్ ఆచార్య శివప్రసాద్, జగన్నాథరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.వి.సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.