పన్నుల చెల్లింపు విధానం మరింత సులభతరం

పన్నుల చెల్లింపు విధానం మరింత సులభతరం
మాట్లాడుతున్న ఆదాయపన్నుశాఖ ప్రధాన కమిషనర్ ఎం.భూపాల్‌రెడ్డి
ఆదాయ పన్ను చెల్లింపు విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నామని ఐటీ విభాగం ప్రధాన కమిషనర్ ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. పన్నుల చెల్లింపుపై డాబాగార్డెన్స్‌లోని వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో వీజేఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
కేవలం అయిదు నిమిషాల్లో ఆదాయపు పన్ను రిటర్స్లు దాఖలు చేయవచ్చన్నారు. ఆదాయాన్ని బట్టే చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుందని వివరించారు.
ప్రస్తుతం విజయవాడ, విశాఖ కేంద్రాల నుంచి ఏడాదికి రూ. 12 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ఆదాయపన్నులు చెల్లించేవారి కోసం విశాఖలోని ఎంవీపీ కాలనీ, శంకరమఠం ప్రాంతాల్లో కార్యాలయాలు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అనంతరం కమిషనర్‌ను వీజేఎఫ్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. సమావేశంలో జాయింట్ కమిషనర్లు చంద్రన్, డీవీ సుబ్బారావు, టీవీ గోపీకృష్ణ, టాక్స్బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ చలం, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్.దుర్గారావు పాల్గొన్నారు.