News

Realestate News

The progression of bilateral weaker sections


తెదేపాతోనే బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి

సమావేశంలో మాట్లాడుతున్న గంటా శ్రీనివాసరావు, చిత్రంలో

తెలుగుదేశం ప్రభుత్వంతోనే బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆ పార్టీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.

మంగళవారం మధ్యాహ్నం అక్కయ్యపాలెం ప్రధానరహదారిలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో నాయీ బ్రాహ్మణ సేవాసంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం సభ్యులు కోరినట్లుగానే కల్యాణమండపం నిర్మాణం, సొంతిళ్లు, విద్య, వైద్య సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు.

పార్లమెంటు అభ్యర్థి శ్రీభరత్‌ మాట్లాడుతూ తెదేపా హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ఈ సమావేశంలో తెదేపా జిల్లా అధ్యక్షులు ఎస్‌.కె.రెహ్మాన్‌, నాయకులు బొడ్డేటి మోహన్‌, కిశోర్‌కుమార్‌, సంఘం అధ్యక్షుడు బాబు, కార్యదర్శి పి.వెంకటసత్యం, నగర అధ్యక్షుడు ముసిడిపల్లి రమణ, నగర కార్యదర్శి చల్లాపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వాకర్స్‌తో అడుగులో అడుగేసి…

ఉత్తర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గంటా మంగళవారం ఉదయం అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో వాకర్స్‌తో కలసి నడిచారు. స్టేడియానికి వచ్చిన నడకదారులు, వ్యాయమం చేసేవారు, క్రీడాకారులతో ముచ్చటించారు.

ఈ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రత్యర్థి నాయకులు ఓటమి భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు భరణికాన రామారావు, బొడ్డేటి మోహన్‌, పైలా ముత్యాలనాయుడు, వాసుపల్లి రాజు, బాబు, పల్లిశెట్టి అప్పన్న, నమ్మి వెంకట్‌, జానీ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక సంక్షేమానికి తెదేపా కృషి : శ్రీభరత్‌

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: ఉక్కు కార్మికుల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉక్కు బీసీగేటు వద్ద మంగళవారం సభ నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ఉక్కు సొంత గనుల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉక్కు నిర్వాసితులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని, మరోసారి అవకాశం ఇచ్చి తమను గెలిపించాలని కోరారు.

ఎంబీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కాకి గోవిందరెడ్డి, టీఎన్‌టీయూసీ నాయకులు లెనిన్‌, నల్లూరి సూర్యనారాయణ, దానబాల పైడికొండ, బలిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు పప్పు రాజారావు, గంధం శ్రీను తదితరులు పాల్గొన్నారు