News

Realestate News

The difficulty that Corona brought

కరోనా తెచ్చిన కష్టం

                                                                                             

మలేసియాలో ఉత్తరాంధ్రవాసుల పడిగాపులు

కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో తెలుగు యువకులు

ఉత్తరాంధ్ర సహా ఇతర జిల్లాలకు చెందిన రాష్ట్రవాసులు మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. మంగళవారం బయల్దేరాల్సిన ఎయిర్‌ ఏసియా విమానంలో వీరంతా విశాఖ చేరుకోవాల్సి ఉంది. కరోనా దెబ్బకు మలేసియా నుంచి వచ్చే విమానాలను ఈ నెల 31 వరకు తాత్కాలికంగా నిషేధించినట్టు కేంద్రం ప్రకటించడంతో ఆ విమానం ఆగిపోయింది. అక్కడ చిక్కుకుపోయినవారిలో వైద్య విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు. బాధితులంతా భోజనాలు కూడా చేయకుండా నిరసన తెలిపారు. బుధవారం రెండు విమానాలను సిద్ధం చేస్తున్నట్టు మంగళవారం రాత్రికి ఎంబసీ నుంచి సమాచారం వచ్చిందని చెప్పారని నరేష్‌ అనే ప్రయాణికుడు ‘ఈనాడు’కు వెల్లడించారు.

– ఈనాడు, విశాఖపట్నం

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo