News

Realestate News

పన్ను చెల్లింపుదార్ల సమస్యలు పరిష్కరిస్తాం..

పన్ను చెల్లింపుదార్ల సమస్యలు పరిష్కరిస్తాం..

                                                                                         

మాట్లాడుతున్న సీజీఎస్‌టీ ప్రధాన కమిషనర్‌ నరేశ్‌

మహారాణిపేట, న్యూస్‌టుడే: కేంద్ర వస్తు సేవా పన్ను చెల్లింపుదార్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని సీజీఎస్‌టీ ప్రధాన కమిషనర్‌ నరేశ్‌ పెనుమాక అన్నారు. గురువారం పోర్టు ఆవరణలోని సీజీఎస్‌టీ ప్రధాన కార్యాలయంలో పన్ను చెల్లింపుదార్లకు ‘ఓపెన్‌హౌస్‌’ సమావేశం నిర్వహించారు.

జీఎస్‌టీ పన్నులపై వడ్డీ విధించే నిర్ణయాన్ని ఈనెల 14న జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని వివరించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తున్న ప్రతిపాదిత కొత్త జీఎస్టీ రిటర్నులపై అవగాహన కల్పించారు. ఇందుకు ప్రధాన కార్యాలయంలోపాటు జీఎస్టీ సేవా కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.

వాణిజ్య, పరిశ్రమల ప్రయోజనార్థం డైలీ జీఎస్టీ ఎడ్యుకేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇందులో పన్ను వర్తింపు విషయాల్లో ఆచరణాత్మకమైన సహాయాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీజీఎస్‌టీ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.పహీమ్‌, ఏకే బాలాజీ, జె.శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo