News

Realestate News

లక్ష్యం దిశగా ప్రయాణించండి

To Reach The Goal

లక్ష్యం దిశగా ప్రయాణించండి
జి.ఎస్‌.ఐ. డీజీ ఎం.రాజు

ఈనాడు, విశాఖపట్నం: విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకుని దాన్ని సాధించేందుకు శ్రమిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జి.ఎస్‌.ఐ.) డైరెక్టర్‌ జనరల్‌ ఎం.రాజు పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి

అయిన ఆయన జి.ఎస్‌.ఐ.కి అధిపతిగా కీలక పోస్టులోకి ఎదిగిన నేపథ్యంలో ఆయన్ను ఏయూ అధికారులు శనివారం

ప్లాటినం జూబ్లీ అతిథిగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజమహేంద్రవరంలో

డిగ్రీ చదివే కాలంలో సుబ్బారావు అనే అధ్యాపకుడు ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని చెప్పేవారన్నారు. ఆయన చూపిన

మార్గంలో నడిచి ఇంతవాణ్ని అయ్యానన్నారు. జి.ఎస్‌.ఐ.లో భూవిజ్ఞాన శాస్త్రం ప్రధాన విభాగమని, దేశంలో సుమారు 2,800

మంది శాస్త్రవేత్తలకు అవకాశం కల్పిస్తున్న సంస్థ దేశంలో మరొకటి లేదన్నారు. వీసీ ఆచార్య నాగేశ్వరరావు మాట్లాడుతూ

ఎ.యు. నుంచి డీజీలుగా అత్యంత కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరిలో డాక్టర్‌ రాజు ఒకరని తెలిపారు. విద్యార్థులు రాజును స్ఫూర్తిగా

తీసుకోవాలన్నారు. ఎ.యు. సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య సి.వి.రామన్‌ మాట్లాడుతూ సొరంగాల నిర్మాణంలో నిపుణుడిగా

మంచి పేరు పొందారన్నారు. నాగార్జున సాగర్‌ ఎడమకాల్వ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు, ఏలేరు రిజర్వాయర్‌ సొరంగం పనుల్లోనూ,

శ్రీశైలం ఎడమకాల్వ, తెలుగుగంగ కాల్వల నిర్మాణంలోనూ డాక్టర్‌ రాజు కీలకపాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో భాగంగా

డాక్టర్‌ రాజును వీసీ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ ఆచార్య సి.వి.రామన్‌, తదితరులు ఘనంగా సన్మానించారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo