News

Realestate News

ఏయూ వైద్యశాల పరికరాలు ప్రారంభం

started medical eqipment andhra univesrsity .Visi Acharya G. Nageswara Rao started the new devices at the Andhra University Hospital on Tuesday evening.


ఏయూ వైద్యశాల పరికరాలు ప్రారంభం


వైద్య పరికరాలను ప్రారంభిస్తున్న ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు

 ఆంధ్ర విశ్వవిద్యాలయం వైద్యశాలలో నూతన ఉపకరణాలను వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.

వైద్యశాలకు అవసరమైన ఆక్సిజన్‌ మీటర్‌ను ముందుగా ప్రారంభించారు. దీని సహాయంతో ఇద్దరికి ఒకే పర్యాయం ఆక్సిజన్‌ అందించే అవకాశం ఉంది.

కేవలం డిస్టిల్‌ వాటర్‌ సహాయంతో ఆక్సిజన్‌ను ఈ పరికరం తయారుచేసి సరఫరా చేస్తుంది. అనంతరం ఫిజియో థెరపీ కేంద్రంలో షార్ట్‌వేవ్‌ డయాథెర్మి, అల్ట్రాసౌండ్‌ థెరపీ, టెన్స్‌ పేరడిక్‌ అండ్‌ గాల్వనిక్‌ యూనిట్‌లను వీసీ నాగేశ్వరరావు ప్రారంభించారు.

వీసీ మాట్లాడుతూ వర్సిటీ వైద్యశాలకు అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో సమకూర్చడం జరుగుతోందన్నారు.

కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.నిరంజన్‌, వైద్యాధికారి డాక్టర్‌ కె.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఫిజియో థెరపీ వైద్యులు కె.తిరుపతిరాజు తదితరులు పాల్గొన్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo