నేటి నుంచి సర్ విజ్జీ ట్రోఫీ క్రికెట్ పోటీలు

నేటి నుంచి సర్ విజ్జీ ట్రోఫీ క్రికెట్ పోటీలు
రైల్వే స్టేడియంలో సాధన చేసేందుకు సిద్ధమవుతున్న అర్జున్ తెందూల్కర్
సర్ విజ్జీ ట్రోఫీ క్రికెట్ ఆహ్వానపు పోటీలు గురువారం నుంచి విశాఖతో పాటు విజయనగరంలోనూ జరగనున్నాయి. గ్రూప్-ఎ విభాగంలో ఏసీఏ ప్రెసిడెంట్ ఎలెవెన్, ఐవోసీ, జమ్ము-కశ్మీర్, బరోడ, ఛత్తీస్‌గఢ్, గ్రూపు-బి విభాగంలో ఏసీఏ సెక్రటరీస్ ఎలెవెన్, ముంబయి, ఎంపీసీఏ, పుదుచ్చేరి, హెచ్సీసీఏ జట్లు తలపడతాయి.
గ్రూపు-ఎలో మ్యాచ్‌లన్నీ విజయనగరం క్రికెట్ అకాడమీ మైదానంలో జరగనుండగా, గ్రూపు-బిలోని పోటీలు విశాఖ నగరంలో రైల్వే స్టేడియంతో పాటు ఏసీఏ-వీడీసీఏ మైదానంలో నిర్వహించనున్నారు.. మ్యాచ్‌ల్లో తలపడేందుకు వివిధ జట్ల క్రీడాకారులు బుధవారం నగరానికి చేరుకున్నారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ బుధవారం రైల్వే స్టేడియంలో కొంత సేపు సాధన చేశాడు. అతడితో పాటు మరి కొందరు క్రీడాకారులు సాధనలో పాల్గొన్నారు.