News

Realestate News

గిరిజన విశ్వవిద్యాలయానికి లోగో పంపించండి(Send logo to Tribal University)

 Send logo to Tribal University

విజయనగరం జిల్లాలో త్వరలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ‘లోగో’ తయారు చేసి పంపించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మెంటార్‌ కల్నల్‌ ఆచార్య నాగేశ్వరరావు కోరారు.

ఏయూలో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘గిరిజన సంస్కృతి, కళలు, జీవన విధానం, వేషభాషలు’ ప్రతిబింబించే విధంగా రాజముద్ర(లోగో)ను రూపకల్పన చేసి రెండు వారాల్లోపు తమ పూర్తి వివరాలతో

cechancellor@andhrauniversity.edu.in కి లేదా 96666 33885 వాట్సాప్‌ నెంబరుకి పంపించాలని ఆయన కోరారు. బాగున్నదానికి పారితోషికం, సత్కారం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సమన్వయకర్త డాక్టర్‌ ఎన్‌.వి.ఎస్‌.సూర్యనారాయణ 96666 33885ను సంప్రదించాలని కోరారు.