
కళాశాల స్థలాన్ని కాపాడండి
ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు
ప్రిన్సిపల్ చంద్రశేఖర్‌తో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
వివరాలు రెవెన్యూను అడగండి
డాక్టర్ వీఎస్కృష్నప్రభుత్వడిగ్రీకళాశాలకు సంబంధించిన స్థలం ప్రధాన ముఖద్వారంవద్ద ఉన్న కళాశాల స్థలం కబ్జాకు గురైందని చేస్తున్న ఆరోపణలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో ఖండించారు.
కళాశాల ముఖద్వారం వద్ద ఉన్న స్థలం మూడు సంవత్సరాల క్రితం హైకోర్టు ఆదేశాను సారం రెవెన్యూ విభాగం వారు సదరు పార్టీకి అప్పగించారన్నారు.
స్థలానికి సంబంధించిన వ్యవహారాలన్ని రెవెన్యూ విభాగం ఆధ్వర్యంలో జరిగాయన్నారు. స్థలం సమాచారం కావాలంటే రెవెన్యూ విభాగం వారిని సంప్రదించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.