రహదారులకు కొత్త కళ

కార్పొరేషన్ :
మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని రహదారులు, విభాగినులకు కొత్త కళ చేకూరింది. బ్రిక్స్ సదస్సు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకూ నగరంలో నిర్వహించనున్న నేపథ్యంలో సుందరీకరణ పనులపై జీవీఎంసీ దృష్టి పెట్టింది. నగరంలోని జాతీయ రహదారిపై షీలానగర్ నుంచి మద్దిలపాలెం వరకు జాతీయ రహదారి విభాగిని మరమ్మతు పనులు చేపట్టారు. వాటికి రంగులు వేస్తున్నారు. దీంతో నగరానికి కళ వస్తోంది. తాటిచెట్లపాలెం నుంచి సర్వీసు రహదారి, రైల్వేస్టేషన్ రహదారి, పైవంతెన, దిగువన ఉన్న సర్వీసు రహదారి, సంపత్ వినాయగర్ రహదారి, సిరిపురం మీదుగా బీచ్ రోడ్డు వరకు రహదారుల విభాగినులకు రంగులేస్తున్నారు. బీచ్‌రోడ్డులోని విద్యుత్తు స్తంభాలకు సైతం రంగులు కూడా వేసి సుందరంగా తయారు చేస్తున్నారు. రూ. కోటి విలువైన పనులు జీవీఎంసీ చేపడుతుండగా, ట్రాఫిక్ పోలీసు విభాగం కూడా రహదారులపై మార్కింగ్ లైన్లను వేస్తున్నారు. నగరంలో కొన్ని ప్రధాన కూడళ్లలో చెత్త వేయడానికి అనువుగా స్టీల్ బిన్నులను కూడా ఏర్పాటు చేస్తున్నారు.