News

Realestate News

బాధ్యతగా విద్యాబుద్ధులు నేర్చుకోవాలి

Responsible educators must learn AMC Principle Reference.


బాధ్యతగా విద్యాబుద్ధులు నేర్చుకోవాలి

విద్యా సంవత్సర ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైద్యాధికారులు డాక్టర్‌ సుధాకర్‌,
డాక్టర్‌ అర్జున తదితరులు

‘వైద్య విద్య అత్యున్నతమైనది. ప్రతిదీ మనసుతో నేర్చుకోండి. భవిష్యత్తులో మీరే పేదల పెన్నిధి కావచ్ఛు ఎంతోమంది ప్రాణాలను నిలపవచ్ఛు మరెందరికో స్ఫూర్తి కావచ్ఛు అమ్మానాన్నల కలలకు ప్రతిరూపాలై నిలవండి.

ర్యాగింగ్‌ వంటి అనైతిక ప్రవర్తనను దరికి కూడా రానివ్వొద్ధు నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే.. మిమ్మల్ని ఓ అద్భుత వ్యక్తులుగా తీర్చిదిద్దే శక్తి మాకుంది..’’

-ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ కోర్సులో కొత్తగా చేరిన విద్యార్థులకు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ ఉద్బోధ.

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: వైద్య విద్య కోర్సుల్లో చేరుతున్నవారంతా బాధ్యతతో విద్యాబుద్ధులు నేర్చుకోవాలని, సరైన నడవడిక, క్రమశిక్షణతో మెలగాలని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ సూచించారు.

ఆంధ్ర వైద్యకళాశాల ఎంబీబీఎస్‌ ప్రవేశాలు పూర్తయిన నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సర ప్రారంభ కార్యక్రమాన్ని అంకోసా సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. తరగతులను జ్యోతి వెలిగించి కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ ప్రారంభించారు.

కార్యక్రమంలో కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున, ఉప ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ జయరాజ్‌, డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ ర్యాగింగ్‌ వంటి అనైతిక చర్యలకు పాల్పడి బంగారు భవితను బుగ్గిపాలు చేసుకోవద్దని సూచించారు. ఆంధ్ర వైద్యకళాశాలకు దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, వాటిని మీరు మరింత ఎత్తులకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ అర్జున మాట్లాడుతూ సూపర్‌స్పెషాలిటీ వైద్యులవ్వాలన్నదే లక్ష్యం కాకూడదని, మానవతా దృక్పథాన్ని విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలన్నారు.