News

Realestate News

తెలంగాణలో పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

Polytec Counseling postponed Telangana.


తెలంగాణలో పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా

తెలంగాణలో రేపటి నుంచి జరగాల్సిన పాలిసెట్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 17 నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

సవరించిన షెడ్యూలు ప్రకారం.. విద్యార్థులు ఈ నెల 17 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు, ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు, స్లాట్‌ బుకింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 18 నుంచి 21వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. ఈ నెల 18 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కన్వీనర్ నవీన్ మిత్తల్ సూచించారు.

ఈ నెల 25న అభ్యర్థులకు పాలిటెక్నిక్ సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌ బోధనా రుసుము చెల్లించి.. కళాశాలలకు రిపోర్టు చేయాలి.

జూన్ 1న కళాశాలలకు వెళ్లి చేరాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున..

సీట్ల సంఖ్య తేలకపోవడంతో కౌన్సెలింగ్‌ను మూడు రోజులు పాటు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.