పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలిస్తున్న కౌన్సెలింగ్ అధికారులు
ఈ ఏడాది ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2019 కౌన్సెలింగ్ శుక్రవారం ప్రభుత్వ పాలిటెక్నిక్, కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రారంభమైంది.
ర్యాంక్ 1 నుంచి 8000 వరకు అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలను క్యాంపస్ అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను కట్టించుకున్నారు.
కౌన్సెలింగ్ పూర్తయిన అభ్యర్థులంతా ఈనెలలో జరగనున్న వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది. రెండు కళాశాలల్లోనూ కౌన్సెలింగ్‌ను ప్రిన్సిపల్స్ డి.ఫణీంద్రప్రసాద్, బి.దేముడు పర్యవేక్షణలో చేపట్టారు. కౌన్సెలింగ్ కేంద్రాల్లోకి విద్యార్థులను మాత్రమే అనుమతించారు.
మిగిలిన వారంతా సమీప చెట్ల కింద, కళాశాలలో వేసిన టెంట్ల కింద వేచి ఉన్నారు.
ర్యాంకర్ల అభిప్రాయాలు
కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో పలువురు ర్యాంకర్లు ఉన్నారు. పదో తరగతిలో మంచి మార్కులు పొంది పాలిసెట్‌లోనూ మంచి ర్యాంక్‌ను సాధించారు. పాలిసెట్‌లో మంచి బ్రాంచ్‌ను ఎంచుకుని భవిష్యత్‌ని తీర్చిదిద్దుకుంటామని ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
పేరు: ఎస్.హేమకుమార్, ఆదర్శనగర్, ఓల్డ్ డైరీఫారం
పదో తరగతిలో వచ్చిన మార్కులు: పదికి పది
పాలిసెట్ ర్యాంక్: 427
పాఠశాల: శ్రీకృష్ణ గ్లామర్ పాఠశాల తల్లిదండ్రులు: ఎస్.శివరాం తాపీమేస్త్రీ, సత్యవతి గృహిణి
పాలిటెక్నిక్‌లో తీసుకుంటున్న బ్రాంచ్: మెకానికల్
ఆసక్తి: తెలిసిన వారు కొందరు ఇదే బ్రాంచ్‌ను తీసుకుని ఉద్యోగాలు పొందడం వల్ల..
పేరు: పి.హేమలత, ఊర్వశికూడలి
పదో తరగతి మార్కులు: పదికి పది
పాలిసెట్ ర్యాంక్: 595
పాఠశాల: కప్పరాడ జీవీఎంసీ పాఠశాల
తల్లిదండ్రులు: శ్రీనివాసరావు టైలరింగ్, తల్లి దేవి గృహిణి
పాలిటెక్నిక్‌లో తీసుకుంటున్న బ్రాంచ్: ఈఈఈ
ఆసక్తి: ఎలక్ట్రానిక్స్ రంగం అంటే ఎనలేని ఇష్టం
పేరు: ఎం.గిరి మహేష్‌బాబు, రాంబిల్లి మండలం, వెలుచూరు గ్రామం
పదో తరగతిలో వచ్చిన మార్కులు: 9.8
పాలిసెట్ ర్యాంక్: 760
పాఠశాల: రాంబిల్లిలోని జిల్లాపరిషత్ పాఠశాల
తల్లిదండ్రులు: అప్పలనాయుడు రోజువారీ కూలి, వరలక్ష్మి గృహిణి
పాలిటెక్నిక్‌లో తీసుకుంటున్న బ్రాంచ్: మెకానికల్
ఆసక్తి: ఐఐటి చేయాలని