People’s resentment on voter cards

ఓటరు కార్డుల పారబోతపై ప్రజల ఆగ్రహం
People’s resentment on voter cards
ఓటరు కార్డుల పారబోతపై ప్రజల ఆగ్రహం
ఎన్నికల కమిషన్ ఓటు నమోదు, కార్డుల పంపిణీ పై అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బందికి అవేమీ పట్టడం లేదు.
ఓటు నమోదు చేసుకున్న వారికి అందజేయవలసిన ఓటరు కార్డుల్ని చెత్త కుండీల వద్ద, కార్యాలయం బయట పారబోశారు.
మంగళవారం 39వ వార్డు బిల్ కలెక్టర్ కార్యాలయం బయట రెండు బస్తాలతో పలువురి ఓటరు కార్డులు పారబోశారు.
వార్డులో గత కొంత కాలంగా ఓటు నమోదు చేసుకుంటున్న ప్రజలకు సంబంధించిన ఓటరు కార్డులివి.
ఇంటింటికీ వెళ్లి కార్డులు ఇవ్వవలసిన బీఎల్వోలు, వాటిని పర్యవేక్షించవలసిన సంబంధిత అధికారులు వీటిని పట్టించుకోలేదు.
దీంతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఓటరు కార్డులను బస్తాల్లో వేసి మూలన పడేశారు.
వాటిని సంబంధిత సిబ్బంది పంపిణీ చేయకుండా బయట పారబోయడం పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే కార్డులను సంబంధిత ఓటర్లకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.