News

Realestate News

P.k Rath sankethika auditorium speech vukkunagaram

Plays a key role in the country's economic ukkurangam pikerat CMD said.


దేశాభివృద్ధిలో ఉక్కురంగం కీలకపాత్ర

04GWK73A1

సావనీర్‌ ఆవిష్కరించిన ఉక్కు సీఎండీ పి.కె.రత్,

నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ వైస్‌ సీఎండీ మొహంతి

దేశ ఆర్థికాభివృద్ధిలో ఉక్కురంగం కీలక పాత్ర పోషిస్తోందని సీఎండీ పి.కె.రత్‌ అన్నారు. ఉక్కు కర్మాగారం సాంకేతిక శిక్షణ సంస్థ ఆడిటోరియంలో విశాఖ ఉక్కు, ఐఐఎం వైజాగ్‌ చాప్టర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘టెక్నలాజికల్‌ అడ్వాన్స్‌మెంట్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ న్యూగ్రేడ్స్‌ ఇన్‌ లాంగ్‌ ప్రొడక్ట్స్‌’ అనే అంశంపై గురువారం ఏర్పాటు చేసిన జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.

దేశంలో తలసరి ఉక్కు వినియోగం 75 కిలోలు ఉందని, అంతర్జాతీయంగా 220 కిలోలు ఉందన్నారు. ఇలాంటి సమయంలోనే కొత్త ఉత్పత్తులపై దృష్టి సారించాలన్నారు ప్రస్తుతం నిర్మాణ రంగంతో పాటు, ఆటోమొబైల్, రైల్వేలు, రోడ్స్, డిఫెన్స్‌ వంటి వాటిల్లో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో ఉక్కు వినియోగం పెరిగిందని, అందులోనూ పొడవైన ఉత్పత్తులది ప్రధాన పాత్ర అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ వైస్‌ సీఎండీ ఎస్‌.ఎస్‌.మొహంతి మాట్లాడుతూ 100 శాతం నాణ్యత గల పొడవు ఉక్కు ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉందని, ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉక్కు డైరెక్టర్లు రాయ్‌చౌదరి, వి.వి.వేణుగోపాలరావు, ఈడీలు, జీఎంలతో పాటు పలు ఉక్కు ఉత్పత్తుల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.