News

Realestate News

‘ఒప్పంద ఉద్యోగులపై యాజమాన్యం వివక్ష’

Ownership discrimination against contract employees.


‘ఒప్పంద ఉద్యోగులపై యాజమాన్యం వివక్ష’

 

ఆర్‌ఈసీఎస్‌ ఒప్పంద ఉద్యోగుల సంఘం నిరసన


పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఒప్పంద ఉద్యోగులు

 అనకాపల్ల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంఘంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల (సీపీడబ్ల్యూ)పై యాజమాన్యం వివక్ష చూపుతోందని ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. 30 ఏళ్లగా ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో కశింకోట, మునగపాక, పరవాడ, సబ్బవరం, అనకాపల్లి ప్రాంతాల్లో 380 మంది ఒప్పంద కార్మికులుగా పని చేస్తున్నారు.

రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతన చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నప్పటికీ సర్వీసులను రెగ్యులర్‌ చేయడంలో వివక్ష చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలు కోల్పోయారని వారికి ఆర్థి.క సాయంగాని, భరోసా ఇచ్చేవారు కరవయ్యారన్నారు.

మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నా వేతనాల్లో ఎటువంటి మార్పు లేదని, సంస్థకు అనుబంధంగా ఉన్న రాజీవ్‌గాంధీ ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేసిన 9 సంవత్సరాల్లో అధ్యాపకులకు, ఉద్యోగులకు చాలాసార్లు జీతాలు పెంచారని వీరంతా ఆరోపించారు.

సీపీడబ్ల్యూ ఉద్యోగులందరికీ ఏపీ ఈపీడీసీఎల్‌తో సమానంగా వేతనాలు అమలు చేసి కళాశాల ఉద్యోగులకు వారి విధులకు అనుగుణంగా న్యాయం చేయాలని కోరారు.

మేనేజింగ్‌ డైరెక్టరు, ఏవో ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతున్నారని వీరంతా మండిపడ్డారు. ప్రతినెలా కోట్లాది రూపాయలు సంస్థ నుంచి కళాశాలకు వెచ్చించడం సరికాదన్నారు.

ఆర్‌ఈసీఎస్‌ నుంచి కళాశాలకు బదిలీ అవుతున్న నిధులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల యూనియన్‌ అధ్యక్షులు కె.రవి, ప్రధాన కార్యదర్శి ఎం.పరదేశినాయుడు, ఎస్‌.రమేష్‌, ఒప్పంద ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎస్‌.గోవిందు, ప్రధాన కార్యదర్శి డి.వెంకట్‌ తదితరులు పేర్కొన్నారు.

ఈ మేరకు పర్సన్‌ ఇన్‌చార్జ్‌ రామకృష్ణరాజుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టరు, సంబంధిత శాసనసభ్యులకు, డీసీవోలకు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు వీరు తెలిపారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo