News

Realestate News

9నుంచి 11 వరకు సనాతన వేదాంత జ్ఞానసభలు

9నుంచి 11 వరకు సనాతన వేదాంత జ్ఞానసభలు

                                                    

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: తగరపువలస ఫుట్‌బాల్‌ మైదానంలో మార్చి 9 నుంచి 11 వరకు 94వ శ్రీ సనాతన వేదాంత జ్ఞానసభలు నిర్వహించనున్నట్లు ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం స్వామి అసంగానందగిరి తెలిపారు. మంగళవారం డాబాగార్డెన్స్‌ వీజేఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

విశాఖలో మొదటి సారిగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం జ్ఞానసభలను శ్రీవ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యజ్ఞం, దానం, తపస్సుతో పాటు ఆధునిక యుగంలో సనాతన ధర్మ విశిష్టతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.

ఈ సభకు 10వేల మంది ప్రజలు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. వీఆర్‌కే ప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి, మాధవరావు, సత్యనారాయణ, రాంబాబు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo