NRI college Convocation awarded a Bachelor of Medicine

ఎన్నారై వైద్యకళాశాల స్నాతకోత్సవం
బ్యాచ్ టాపర్ ఆశారాణికి వైద్య డిగ్రీ పట్టా అందిస్తున్న ఎయిమ్స్ డైరెక్టర్
స్విమ్స్ వీసీ డాక్టర్ రవికుమార్, తదితరులు
సంగివలస ఎన్నారై వైద్య కళాశాల (ఎన్ఆర్ఐఎంఎస్) స్నాతకోత్సవం బుధవారం ఘనంగా జరిగింది.
మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్, తిరుపతి స్విమ్స్ వీసీ ఆచార్య డాక్టర్ టీఎస్ రవికుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ వృత్తిపై అంకితభావం, సామాజిక బాధ్యత, ఓర్పు, సహనం వంటి సద్గుణాలు కలిగి ఉండాలన్నారు.
దేశం గర్వించదగ్గ వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఎన్నారై వైద్యకళాశాల స్నాతకోత్సవం.
అనంతరం బ్యాచ్ టాపర్ డాక్టర్ దిగుమర్తి ఆశారాణి, ఒక్కరోజు కూడా కళాశాలకు గైర్హాజరు కాని డాక్టర్ నంబళ్ల శ్రీనివాసరావు సహా 131 మంది విద్యార్థులకు వైద్య డిగ్రీ పట్టాలు అందజేశారు.
అనిల్ నీరుకొండ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ నీరుకొండ బాబూరాజేంద్ర ప్రసాద్, ఎన్నారై వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కల్పనా సుబ్రహ్మణ్యం, పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్ బీఎస్ కృష్ణమ్మ, ఆచార్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.