NPR cashwithdrawl tamilnadu

ఎన్పీఆర్పై భయం.. నగదు విత్డ్రా!
తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులకు వింత అనుభవం ఎదురవుతోంది.
కొంతమంది ముస్లింలు గత కొన్ని రోజులుగా వారు పొదుపు చేసుకున్న డబ్బులను పెద్దమొత్తంలో వెనక్కితీసుకుంటున్నారు.
ప్రభుత్వం జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్) అమలు చేస్తే తమ ఖాతాలు రద్దవుతాయనే భయం వారిలో నెలకొనడమే అందుకు కారణం.
నాగపట్టణం జిల్లాలోని తెరిజండూరు పరిధిలోని ముస్లిం వర్గ ప్రజల్లో ప్రభుత్వం ఎన్పీఆర్ అమలు చేస్తుందేమోననే భయం నెలకొంది.
అంతేకాకుండా బ్యాంకు ఖాతా కేవైసీ అప్డేషన్కు కూడా పలు ధ్రువపత్రాలు సమర్పించాలేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పరిధిలో వంద మంది ఖాతాదార్లు మూకుమ్మడిగా నగదును ఉపసంహరించుకున్నారు.
కేవైసీ అప్డేట్ కోసం ధ్రువపత్రాలు సమర్పించకపోతే తమ ఖాతాలు రద్దు చేస్తారేమోనని భయపడుతున్నట్లు చర్చించుకుంటున్నారు.
దీంతో షాక్కు గురైన అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిపై ఆ వర్గానికి చెందిన పలువురు బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ.. పార్లమెంటులో సీఏఏ ఆమోదించినప్పటి నుంచి ప్రజలంతా భయంతో ఉన్నట్లు చెప్పారు.