News

Realestate News

విశ్వవిద్యాలయంలో రాజకీయాలకు తావులేదు

No politics in andhra university .Acharya PVGD Prasad Reddy, who took on additional duties as visa, said that Au was just providing education .


విశ్వవిద్యాలయంలో రాజకీయాలకు తావులేదు

వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి

ఆచార్య ప్రసాదరెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేస్తున్న
రెక్టార్‌ ప్రసాదరావు, చల్లా రామకృష్ణ

 ఆంధ్రా యూనివర్సిటీ కేవలం విద్యను అందించడానికే ఉందని, ఇక్కడ రాజకీయాలకు తావు లేదని.. వీటికి అతీతంగా విశ్వవిద్యాలయం నడుస్తుందని వీసీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.

మాతృవిభాగమైన కంప్యూటర్‌ సైన్స్‌ను బుధవారం సందర్శించిన సందర్భంలో విద్యార్థులు, ఉద్యోగులు, ఆచార్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో క్రమశిక్షణతో కూడిన విద్యను ప్రతి విద్యార్థికి అందించాలని ఆశిస్తున్నానన్నారు.

తనకు ప్రతీ విద్యార్థి ప్రత్యేకమేనన్నారు. విశ్వవిద్యాలయాలు కేవలం విద్యార్థుల కోసమే ఉన్నాయన్నారు. వారికి ఎటువంటి కష్టం, నష్టం కలగకుండా విద్యనందిస్తామన్నారు.

రెక్టార్‌ ప్రసాదరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య టి.బైరాగిరెడ్డి, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య పేరి శ్రీనివాసరావు, మీడియా రిలేషన్స్‌ డీన్‌ ఆచార్య పి.బాబివర్థన్‌, అసోసియేట్‌ డీన్‌ ఆచార్య చల్లా రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ ఆచార్య ఎం.వి.ఆర్‌.రాజు, కంప్యూటర్‌ సెంటర్‌ సంచాలకులు ఆచార్య కె.వెంకటరావు పెద్దసంఖ్యలో ఆచార్యులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రసాదరెడ్డి శుక్రవారం వీసీ ఛాంబర్‌ నుంచి విధులు నిర్వహించనున్నట్లు తెలిసింది.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo