ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేయాలి

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేయాలి

ప్రభుత్వానికి, ప్రజలకు వాలంటీర్లు వారధిలా పనిచేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బీచ్‌రోడ్డు ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వార్డు వాలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంతో పాటు సమస్యలను ప్రభుత్వానికి తెలియపరుస్తూ పారదర్శకంగా అందుబాటులో ఉండాలని తెలిపారు. 9,732 మంది వీటికి ఎంపికవగా 8,291 మంది వాలంటీర్లు శిక్షణ పొందినట్లు తెలిపారు.
శిక్షణా కార్యక్రమానికి గైర్హాజరైన వారికి వాలంటీర్లుగా అవకాశం లేదన్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి కొత్తగా ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్ సృజనకు సూచించారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ సేవాభావంతో ఉన్న యువతకు ఉపాధి కల్పించే దిశగా గ్రామ, వార్డు వాలంటీర్లను నియామకం చేపట్టినట్లు చెప్పారు.
ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఎమ్మెల్యేలు, జీవీఎంసీ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.