News

Realestate News

గురుకుల విద్యార్థులకు మంత్రి అభినందన

Minister congratulates Gurukul students.


గురుకుల విద్యార్థులకు మంత్రి అభినందన

విద్యార్థులను అభినందిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

 మధురవాడ ఏపీ బాలయోగి గురుకుల ప్రతిభ పాఠశాల, కళాశాల 9, 10 తరగతుల విద్యార్థినులు కెఎల్‌ఎస్‌పి వర్షిణి, జి.మౌనికలు గతంలో రూపొందించిన ‘ఆల్‌ ఇన్‌ వన్‌ రోబో’ (అగ్రిటెక్‌ రోబో) నమూనా జాతీయస్థాయిలో 50 ఉత్తమ ఇన్నోవేషన్లలో మొదటిస్థానంలో ఎంపికయింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును బుధవారం ఆయన నివాసంలో కలిశారు. ప్రాథమిక స్థాయిలోనే శాస్త్ర సాంకేతిక రంగాలపై గురుకుల విద్యార్థులు పట్టు సాధించడం అభినందనీయమంటూ సంబంధిత విద్యార్థులను మంత్రి ప్రశంసించారు.

నమూనా రూపకల్పనకు సహకరించిన ఏటీఎల్‌ ఇన్‌ఛార్జి టి.రాంబాబును అభినందించారు. నీతి ఆయోగ్‌ వారు సెప్టెంబరు 13న న్యూదిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులను ఆహ్వానించినట్లు ప్రిన్సిపల్‌ ఎస్‌.రూపవతి తెలిపారు.

గురుకుల సమన్వయకర్త ఆర్‌.డి.వి.చంద్రశేఖర్‌రావు, సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ జయప్రకాష్‌, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.