మార్మోసెట్ కోతులు వచ్చేశాయ్…
మార్మోసెట్ కోతులు వచ్చేశాయ్…

Marmoset monkeys have arrived in vizag
23 కోతి జాతుల్లో మార్మోసెట్ ఒకటి. ఇవి 20 సెంటి మీటర్ల పొడవు, ఎత్తు 19 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాయి.దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. చురుగ్గా తిరుగాడే ఈ ప్రాణులు చెట్లపై జీవిస్తాయి.
చిన్న పురుగులు, పండ్లు, ఆకులు వంటివి తింటాయి. 3 నుంచి 15 వరకూ బృందాలుగా జీవిస్తాయి. జీవిత కాలం 12 సంవత్సరాలు.
బరువు 260 గ్రాములు ఉంటుంది. వీటి గర్భస్థ కాలం 152 రోజులు. వీటిని మంగళవారం జూ పార్కుకి తీసుకొచ్చారు.
-న్యూస్టుడే, ఆరిలోవ