News

Realestate News

ks chalam demands on north andhra declaration

Members of the Committee that releases the North Distribution Declaration The Central and State Governments


ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ. 50 వేల కోట్లు కేటాయించాలి

Members of the Committee that releases the North Distribution Declaration The Central and State Governments

ఉత్తరాంధ్ర డిక్లరేషన్‌ పుస్తకాన్ని విడుదల చేస్తున్న కమిటీ సభ్యులు

రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలని ఉత్తరాంధ్ర డిక్లరేషన్‌ కమిటీ వ్యవస్థాపక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం డిమాండ్‌ చేశారు.

డాబాగార్డెన్స్‌లోని వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన డిక్లరేషన్‌కు సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉత్తరాంధ్ర వలసలకు నిలయంగా మారి దశాబ్ధాల తరబడి ఇక్కడ అభివృద్ధి ఎండమావి అయ్యిందన్నారు.

ఉత్తరాంధ్రపై ఎలాంటి అవగాహన లేని బయటి వ్యక్తులు పాలకులుగా మారడంతో భూములు, వనరులు దోపడీకి గురవుతున్నాయన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం ఉండడంలేదన్నారు. ఉత్తరాంధ్ర స్వతంత్ర నిపుణులు కమిటీ సభ్యులు ఇక్కడ 45 ప్రధాన సమస్యలు ఉన్నట్లు గుర్తించారని, వాటి వివరాలతో పుస్తకం రూపొందించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో జేఎన్‌టీయూ మాజీ వీసీ అల్లం అప్పారావు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షులు ఎస్‌ఎస్‌ శివశంకర్, ఆచార్యులు కె.చంద్రమౌళి, ఆర్‌. కన్నారావు, పీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo