నేటి నుంచి ఉద్యోగ మేళాలు

నేటి నుంచి ఉద్యోగ మేళాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 19, 20 తేదీల్లో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు.
● ఈనెల 19న డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో జరిగే ఉద్యోగమేళాలో టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో ఉద్యోగాలకు బీటెక్/బీఈ, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత చెందిన అభ్యర్థులు అర్హులు. సైబర్ ఫోక్స్ ఐటి సొల్యూషన్స్‌లో ఉద్యోగాల భర్తీకి ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు.
● ఈనెల 20న ఎంవీపీకాలనీ ఎస్.వి.వి.పి. వి.ఎం.సి. డిగ్రీ కళాశాలలో జరిగే ఉద్యోగ మేళాకు ఐబి సర్వీసెస్ అండ్ టెక్నాలజీస్, అపోలో ఫార్మసీ, బిగ్‌సి, బిగ్ బాస్కెట్ తదితర సంస్థలు పాల్గొంటున్నాయి. బీటెక్/ బీఈ, ఎంసీఏ, ఎంబీఏ, పది, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఫార్మసీ, ఐ.టి.ఐ. ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
● ఈ జాబ్‌మేళాలకు హాజరయ్యే అభ్యర్థులు www.apssdc.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని జిల్లా మేనేజర్ తెలిపారు. ఇతర వివరాలకు 9959377669, 90100 22033 ఫోన్నెంబరులో సంప్రదించాలని కోరారు.
డీఆర్డీఏ ఆధ్వర్యంలో…
● జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – సీడీప్లో భాగంగా ఈనెల 19న జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. జీ4 సెక్యూరిటీస్, మెడిప్లస్ కంపెనీల్లో పనిచేసేందుకు ఈ నెల 19న(శుక్రవారం) ఆనందపురం వెలుగు కార్యాలయంలో ఉద్యోగమేళా జరుపుతున్నారు. 79933 12893 ఫోన్నెంబరులో సంప్రదించాలని కోరారు.
● ఈనెల 20న వరల్డ్ వైడ్ డైమండ్స్ ప్రైవేటు లిమిటెడ్, నవతా ట్రాన్స్పోర్ట్ కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. పది, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐ.టి.ఐ., డిప్లమో చేసిన అభ్యర్థులు అర్హులు. శనివారం ఉదయం 10 గంటల నుంచి గాజువాక ఎంవీఆర్ కళాశాల పక్కన డేటా ప్రో కంప్యూటర్ కేంద్రంలో జరిగే జాబ్‌మేళాకు అర్హులు హాజరుకావాలని అధికారులు కోరారు. ఇతర వివరాలకు 98485 22554, 92480 17344 ఫోన్‌నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
నిరుద్యోగ యువతకు..
కంచరపాలెం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు ఈనెల 20న ఉదయం పది గంటలకు జిల్లా ఉపాధికల్పనా కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారిణి కె.సుధ తెలిపారు. వెబ్రోస్ సొల్యూషన్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, హెల్పర్స్, ప్యాకింగ్ హెల్పర్స్, మెకానిక్ హెల్పర్స్ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.
నేడు ఆచార్య ప్రసాదరెడ్డి బాధ్యతల స్వీకరణ
ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ఆచార్యులు పి.వి.జి.డి ప్రసాదరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. ఆచార్య ప్రసాదరెడ్డికి ఏయూ బాధ్యతలు అప్పగిస్తూ రెండురోజుల క్రితం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అధికారికంగా ఆయన శుక్రవారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనను గురువారం పలువురు నగరవాసులు అభినందించారు.