News

Realestate News

ఈనెల 14వ తేదీన ఉద్యోగ ప్రకటన వెలువడింది

job announcement was made 14th month.


నిబంధనలకు విరుద్ధంగా నియామకాలా?

వీసీ పదవీకాలం ముగిసే దశలో మొదలైన ప్రక్రియ

 

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో వివిధ హోదాల బోధనేతర సిబ్బంది నియామకానికి వర్సిటీ అధికారులు ఉద్యోగ ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

వీసీ పదవీ కాలం వచ్చే నెల పదహారో తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఉద్యోగాల ప్రకటన వెలువరించడం వివాదాస్పదంగా మారుతోంది.

 

ఏయూలోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఈనెల 14వ తేదీన ఉద్యోగ ప్రకటన వెలువడింది. అత్యవసరానికి కొద్దిపాటి ఉద్యోగుల్ని తాత్కాలిక ప్రాతిపదికపై భర్తీ చేస్తే ఎవరూ అభ్యంతర పెట్టరు.

వాస్తవానికి ఏ ఒక్క పోస్టు భర్తీ చేయాలన్నా, అది తాత్కాలిక పోస్టు అయినా నిబంధనల ప్రకారం రోస్టర్‌ విధానం పాటించే నియామకాలు చేపట్టాలని గతంలో విశ్వవిద్యాలయానికి వచ్చిన అసెంబ్లీ కమిటీలు స్పష్టంగా తేల్చి చెప్పాయి.

రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక ప్రాతిపదికపై చేసే నియామకాలకు కూడా రోస్టర్‌ విధానాన్ని పాటించి సామాజిక న్యాయ సూత్రాలను విధిగా పాటిస్తోంది.

ఆయా మౌలిక సూత్రాలన్నింటినీ వర్సిటీ అధికారులు తుంగలో తొక్కి నోటిఫికేషన్‌ వెలువరించారు. ఒకటికాదు… రెండు కాదు… ఏకంగా 146 ఉద్యోగాలను ఆయా ప్రకటన ద్వారా భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అటెండరు పోస్టు నుంచి ఇంజినీర్‌ పోస్టు వరకు అన్ని రకాల పోస్టులను ఆ ప్రకటన ఆధారంగా భర్తీ చేయాలని నిర్ణయించడం విశేషం. పోస్టును బట్టి వారి జీతాన్ని రూ.6వేల నుంచి అత్యధికంగా రూ.20వేల వరకు నిర్ణయించారు. దరఖాస్తుల సమర్పణకు ఈనెల 22వ తేదీ వరకు గడువిచ్చారు.

 

గతంలో వివాదాస్పదమైనా మళ్లీ అదే తీరు….: విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న నియామకాల వ్యవహారం గతంలో పెను దుమారమే రేపింది.

నాటి నియామకాలపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయా ఆరోపణలను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది.

విశ్రాంత ఐ.ఎ.ఎస్‌. అధికారి వెంకటరమణ, మాజీ వీసీ రాఘవులు, నాటి వీసీ నరసింహులు కమిటీ సమగ్రంగా విచారించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో కూడా విడుదల చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు చేపట్టొద్దని సూచించింది.

అత్యవసరమైతే అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా పనులు పూర్తి చేసుకోవాలని సూచించింది. ఆ జీవోను పాటించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకమండలి తీర్మానించింది.

ఒకవేళ ఆయా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టాలని భావిస్తే ఉన్నత విద్యాశాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ వర్సిటీ అధికారులు మాత్రం ఆయా చట్టపరమైన ప్రక్రియలను పాటించకుండా పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం వర్సిటీ ఉద్యోగులకు విస్మయాన్ని కలిగిస్తోంది. 53 మంది సెక్యూరిటీ గార్డులు, 10 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు మాత్రం ఒప్పంద ప్రాతిపదికపై మానవ వనరుల్ని సరఫరా చేసేందుకు గుర్తింపు పొందిన సరఫరాదారులు కొటేషన్లు ఇవ్వవచ్చని వర్సిటీ అధికారులు ప్రకటనలో సూచించారు.

 


Notice: compact(): Undefined variable: limits in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Notice: compact(): Undefined variable: groupby in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 821

Warning: count(): Parameter must be an array or an object that implements Countable in /home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line 399

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo