News

Realestate News

జనసేన అరకు, అనకాపల్లి పార్లమెంటరీ కమిటీల నియామకం

జనసేన అరకు, అనకాపల్లి పార్లమెంటరీ కమిటీల నియామకం

విశాఖపట్నం, న్యూస్‌టుడే : జనసేన పార్టీకి సంబంధించిన అరకు, అనకాపల్లి పార్లమెంటరీ కమిటీలను నియమిస్తూ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఉత్తర్వులు జారీచేశారు. అరకు పార్లమెంటరీ కమిటీ ప్రాంతీయ కార్యదర్శిగా వి.గంగులయ్య, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా చిక్కాల వీర వెంకటరమణ(బాబులు), పి.రాజారావు, ఆదాల మోహనరావు, బూర దేముడు, ఉపాధ్యక్షులుగా ఆర్‌.కరుణకుమార్‌, కోశాధికారిగా రమేష్‌బాబు, అధికార ప్రతినిధులుగా ఎం.శ్రీరాములు, చింతాడ ముఖేష్‌, పవన్‌కుమార్‌లను నియమించారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా 11 మందిని, వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా 27 మందిని నియమించారు. అనకాపల్లి పార్లమెంటరీ కమిటీకి సంబంధించి ప్రాంతీయ కార్యదర్శిగా గెడ్డం అప్పారావు(బుజ్జి), కార్యదర్శిగా చింతల పార్థసారధి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా సరోజిని, శెట్టి చిరంజీవి, ఉపాధ్యక్షులుగా ఎం.సన్యాసినాయుడు, కోశాధికారిగా టి.కన్నబాబు, అధికార ప్రతినిధులుగా దూలం గోపీనాథ్‌, వి.నూకరాజులు, ఇంటిలెక్చువల్స్‌ కౌన్సిల్‌కి జి.వెంకటరాజు, లీగల్‌ విభాగానికి బి.వెంకటరమణలను నియమించారు. వీరితో పాటు 11 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, 32 మందిని వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.