janatha curfew visakhapatnam
అనకాపల్లిలో కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ

అనకాపల్లి పట్టణం: ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ జనతా కర్ఫ్యూకు సహకరించాలని.. విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రహదారిపైకి ఎవరూ రాకపోవడంతో అనకాపల్లిలోని ప్రధాన రహదారి, పూడిమడక రోడ్డు, చోడవరం రహదారి, గౌరపాలెంలోని పరమేశ్వరి పార్కు సెంటర్ నిర్మానుశ్యంగా మారాయి. అనకాపల్లిలోని రైల్వేస్టేషన్, బస్టాండ్లు ప్రయాణీకులు లేక వెలవెలపోయాయి. చేపల మార్కెట్లు, దుకాణాలను, చికెన్, మటన్ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. గ్రామీణ జిల్లా కేంద్రం అనకాపల్లిలోని కూరగాయల మార్కెట్లలో లావాదేవీలు నిలిపివేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కావాల్సిన నూకాలమ్మ కొత్త అమావాస్య జాతరను రద్దు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం నిర్మానుశ్యంగా మారింది. అమ్మవారిని పూజారులు ప్రత్యేకంగా అలంకరించి పూజాకార్యక్రమాలు చేశారు.
