25 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

25 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
జూన్ నెలాఖరుకు ఫలితాల వెల్లడి
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టైంటేబుల్లో రాష్ట్రప్రభుత్వం మార్పులు చేసింది. ఇంటర్ ఫలితాల్లో లోపాలు, పునఃపరిశీలన తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని 10 రోజులు ఆలస్యంగా ప్రారంభించనుంది.
మే 25 నుంచి ఈ పరీక్షలు జరగనున్నట్లు బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ ఆదేశాలు జారీ చేశారు. తొలుత మే 16 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే.
సవరించిన టైంటేబుల్ ప్రకారం మే 25 నుంచి జూన్ 1 వరకు ప్రధాన రాత పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి.
జూన్ 3న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, 4న పర్యావరణ విద్య పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు జూన్ 7 నుంచి 10 వరకు ఉంటాయి.
ఈ పరీక్షలతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగియనున్నాయి. జూన్ నెలాఖరు నాటికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ప్రవేశాలపై ప్రభావం
ఇంటర్ ఫలితాల్లో లోపాలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆలస్యం కావడంతో 2019-20 విద్యాసంవత్సర ప్రవేశాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.
ఏటా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 15 నాటికి ప్రారంభమై.. ఫలితాలు జూన్ 10 వరకు వెల్లడవుతున్నాయి. గత ఏడాది ఇదే పరిస్థితి ఉంది. తాజాగా ఇంటర్ ఫలితాలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో అడ్వాన్స్డ్ ఫలితాలు కొంత ఆలస్యమవుతాయి.
ఈ నేపథ్యంలో ఇంటర్ తరువాత ప్రవేశాలపై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంకుల ప్రకటన ఆలస్యమవుతుంది. ఇంటర్ ఫలితాలు వచ్చేవరకు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనందున..
రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో డిగ్రీ, బీఈడీ, న్యాయవిద్య తదితర కోర్సుల తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఈ విషయంపై అధికారులతో సమావేశమైన కొద్ది రోజుల క్రితం, తిరిగి పరీక్షలు జరిపిన విద్యార్థుల నుంచి తిరిగి లెక్కింపు మరియు తిరిగి లెక్కింపు కోసం ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని ఆదేశించారు.
విఫలమైంది విద్యార్థులు తిరిగి లెక్కింపు మరియు తిరిగి ధృవీకరణ కోసం దరఖాస్తు అవసరం లేదని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
పరీక్షలో ఉత్తీర్ణులైన వేలాది మంది విద్యార్ధులు తిరిగి ధృవీకరణ కోసం కూడా దరఖాస్తు చేశారు.