News

Realestate News

జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్‌ మార్కులకు 40% వెయిటేజీ ఉండేది.

Intermediate marks JEE Mains were 40% weightage.

జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్‌ మార్కులకు 40% వెయిటేజీ ఉండేది.

జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్‌ మార్కులకు 40% వెయిటేజీ ఉండేది.

పరీక్షలకు ముందు.. ఫలితాల తర్వాత ఏటా ఇంటర్మీడియట్‌ విద్యార్థులు మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, వారిపై ఒత్తిడి తగ్గించే ఒక్క చర్యా ఇంటర్‌బోర్డు తీసుకోవడం లేదు.

ఈ విషయంలో పలు రాష్ట్రాలు విభిన్న విధానాలను పాటిస్తున్నాయి. బోర్డు మాత్రం ఏదో ఒక సాకు చెప్పి, స్వల్ప లోపాలు చూపి వెనకడుగు వేయడం అలవాటుగా చేసుకుంది.

ఇంటర్‌లో మార్కులకు బదులు శ్రేణులు ఇవ్వాలని రెండు సంవత్సరాల క్రితమే ఎంతోమంది నిపుణులు, కళాశాలల యాజమాన్యాలు, విద్యావంతులు కోరినా ‘అదిగో ఇదిగో’ అంటూ చివరకు అధికారులు చేతులెత్తేశారు.

జేఈఈ మెయిన్స్‌లో ఇంటర్‌ మార్కులకు 40% వెయిటేజీ ఉండేది. దాన్ని రెండేళ్ల క్రితం రద్దు చేశారు. ఎంసెట్‌లో మాత్రం ఇంటర్‌లోని సైన్స్‌, గణితం సబ్జెక్టుల మార్కుల(600)కు 25% వెయిటేజీ కొనసాగుతోంది.

దాంతో ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఇప్పటికీ ఇంటర్‌ మార్కులకూ తీవ్రంగా పోటీపడుతుంటారు. అందుకే ఇంటర్‌ ఫలితాల్లో తప్పుల వల్ల మార్కులు తగ్గడంతో ఎంతోమంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ తప్పిన విద్యార్థులు 16 మంది వరకు ఆత్మహత్యకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో 2017 అక్టోబరులో పలువురు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో తల్లిదండ్రుల సంఘాలు, విద్యావేత్తలు, కళాశాలల ప్రతినిధులతో విద్యాశాఖ చర్చించింది.

ఆ సందర్భంగా మార్కుల బదులు గ్రేడింగ్‌ విధానాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదన ఎక్కువ మంది నుంచి వచ్చింది. మార్కుల బదులు క్యుములేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (సీజీపీఏ) కింద 10, 9.8, 9.6 ఇలా పాయింట్లు ఇవ్వాలన్నది ప్రతిపాదన.

ఆ లోపాలేంటో కూడా చెప్పరు
విద్యావేత్తల నుంచి వచ్చిన గ్రేడింగ్‌ ప్రతిపాదనపై ఇంటర్‌బోర్డు అక్కడక్కడా తెలిసిన వారి వద్ద నుంచి సమాచారం సేకరించి చివరకు సీజీపీఏ వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని అమలును పక్కనపెట్టేసింది.

తాము సీబీఎస్‌ఈ అధికారులను అడిగామని, వారు కూడా వద్దని సలహా ఇచ్చారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ ఈ నెల 18న ఫలితాల విడుదల సమయంలో ‘ఈనాడు’కు చెప్పారు.

అయితే దానిపై నివేదికను బహిరంగ పరచి చర్చించడంగానీ.. లోపాలపై మళ్లీ విద్యావేత్తలు, కళాశాలల ప్రతినిధులతో చర్చించడంగానీ చేయలేదు. పొరుగు రాష్ట్రాల్లో గ్రేడింగ్‌ అమలు చేస్తున్నారు కదా..

అక్కడ ఏమైనా సమస్యలు వచ్చాయా? అని ‘ఈనాడు’ ప్రశ్నించినప్పుడు ఇతర రాష్ట్రాలతో తమకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు డిగ్రీ, బీటెక్‌ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లోనూ గ్రేడ్ల విధానం అమలు చేస్తున్నారు.

ఒత్తిడి లేకుండా ఉండేందుకు గ్రేడ్లు ఇస్తున్నారని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదేనని నిపుణులు చెబుతున్నారు. ‘ప్రస్తుతం పదో తరగతిలో అమలవుతోంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. బోర్డు అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప భాగస్వాములతో చర్చించడం లేదు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo