బయట హీట్.. లోపల నీట్..

బయట హీట్.. లోపల నీట్..
Heat outside .. Neet inside

తాటిచెట్లపాలెం : నగరంలో వైద్యవిద్య కోర్సుల్లో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా ప్రశాంతంగా ముగిసింది.
మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా కొన్ని చోట్ల ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు.
పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్‌కార్డు, ఆధార్‌కార్డు వంటివి మాత్రమే అనుమతించారు.
విద్యార్థినులు ధరించిన ఆభరణాలు, సెల్ఫోన్లు, బ్యాగులు బయటే వదిలేయాలని సూచించినా.. కొంతమంది తెలియక ధరించి వచ్చారు.
వాటిని కేంద్రం బయట తీసేసి వెళ్లటం కష్టమైంది. కొంతమంది ఆలస్యంగా వచ్చినా అనుమతించలేదు.
తల్లిదండ్రులు సైతం పరీక్ష ముగిసే వరకు కేంద్రాల బయటే వేచి ఉన్నారు.
కొన్ని కేంద్రాల చిరుమానాలు తప్పుగా రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందిపడ్డారు.
హాల్‌టికెట్‌లో తప్పు అడ్రస్ కారణంగా పరీక్షా కేంద్రానికి
ఆలస్యమై పరీక్ష రాయలేక పోయిన విద్యార్థిని హేమలత
బిట్స్వైజాగ్ పరీక్ష కేంద్రం వద్ద ఎండలో గొడుగులు పట్టుకుని బారులు తీరిన విద్యార్థులు, తల్లిదండ్రులు