Group3 examinations postponed

గ్రూపు-3 పరీక్షను వాయిదా వేయాలి

రాష్ట్రంలో ఈ నెల 21న జరగనున్న గ్రూపు-3 ప్రిలిమ్స్ రాత పరీక్షను వాయిదా వేయాలని ఏపీ నిరుద్యోగుల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు.
బుధవారం సాయంత్రం నిరుద్యోగులు ఎంవీపీలో నిరసన దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అదే రోజు తెలంగాణలో ఎస్.ఐ. ప్రధాన పరీక్ష జరుగుతుందని, దీనికి ఏపీ నుంచి అనేక మంది అభ్యర్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. వారు ఆ పరీక్షను రాసేందుకు వీలుగా గ్రూపు-3 పరీక్షను వాయిదా వేయాలని కోరారు.
అలాగే ఎల్ఐసీ, నీట్ పరీక్షలూ ఉన్నాయన్నారు. గ్రూపు-2 పరీక్షకు రోస్టర్ విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది శాతం ఈబీసీ రిజర్వేషన్ను వర్తింపజేయలేదని తెలిపారు.
అందువల్ల కొత్త రోస్టర్ విధానాన్ని అమలు చేస్తూ మరిన్ని పోస్టులు పెంచి నూతన ప్రకటన విడుదల చేయాలని కోరారు. విశాఖ కన్వీనర్ తిరుపతిరావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.