News

Realestate News

గ్రూప్‌-3 పరీక్షకు 60.56%హాజరు


గ్రూప్‌-3 పరీక్షకు 60.56%హాజరు

‘తిమ్మాపురం’ ఘటన మినహా అంతా ప్రశాంతం

జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ఆదివారం నిర్వహించిన వడబోత (స్క్రీనింగ్‌) పరీక్ష కొన్ని అపశ్రుతులు మినహా జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.

పోస్టులు సంఖ్య తక్కువే అయినప్పటికీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వేల సంఖ్యలో ఉండడంతో జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను యంత్రాంగం ఏర్పాటుచేసింది.

విశాఖలో యపీఎస్సీ, ఎంసెంట్‌ పరీక్షలు ఆదివారమే ఉండడం వల్ల గ్రూప్‌-3 కోసం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

జిల్లాకు 60,641 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ కేటాయించింది. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 180 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మొత్తం అభ్యర్థుల్లో 36,730 (60.56 శాతం)మంది హాజరయ్యారు. 23,911 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది.

 

‘తిమ్మాపురం’ ఘటనపై ఏపీపీఎస్సీకి నివేదిక

పలు పరీక్షా కేంద్రాల చిరునామాల విషయంలో అభ్యర్థులు తత్తరపాటుకు గురయ్యారు. ఫలితంగా దాదాపు 200 మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు.

ఎస్‌.రాయవరం మండలం తిమ్మాపురం గ్రామంలోని ఆదర్శ జూనియర్‌ కళాశాల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ 600 మంది అభ్యర్థులను కేటాయించారు.

ఇదే పేరుతో భీమిలి మండలం బీచ్‌రోడ్డులో మరో తిమ్మాపురంగా గ్రామం ఉంది. తమకు కేటాయించిన కేంద్రం అక్కడ ఉందనుకుని భీమిలిలోని తిమ్మాపురం వెళ్లిపోయారు.

దీంతో 200 మంది పరీక్షా రాసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఏపీపీఎస్సీ అధికారులు తిమ్మాపురం కేంద్రం వరకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను సైతం అనుమతించేందుకు మినహాయింపు ఇచ్చినా, దూరాభారం కావడంతో అత్యధికులు వెళ్లలేకపోయారు.

విశాఖలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఏపీపీఎస్‌సీకి యంత్రాంగం నివేదిక పంపుతోంది. డీఆర్వో గున్నయ్య, పరీక్షల విభాగం పర్యవేక్షకులు పి.వి.రత్నం, ఏపీపీఎస్సీ నుంచి పరిశీలకులుగా వచ్చిన అధికారులు కుమార్‌రాజు తదితరులు పరీక్షల నిర్వహణను పరిశీలించారు.

 

ఎన్‌డీఏ పరీక్షకు 62.11 శాతం హాజరు

నగర పరిధిలోని 15 కేంద్రాల్లో యనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యపీఎస్‌సీ) ఆధ్వర్యంలో జరిగిన ఎన్‌డీఏ పరీక్షకు 62.11 శాతం మంది హాజరయ్యారు. విశాఖకు 6490 మంది అభ్యర్థులను కేటాయించారు.

ఉదయం జరిగిన పరీక్షకు 62.11 శాతం, మధ్యాహ్నం పరీక్షకు 61.06 శాతం మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

 

చివరికి పరీక్ష రాశారు…

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: షీలానగర్‌లోని ఐయాన్‌ డిజిటల్‌ ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రంలో ఎంసెట్‌ పరీక్ష సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు భద్రతా సిబ్బంది గేటుకు తాళం వేసి లోపలికి వెళ్లిపోతున్నారు.

అదే సమయంలో తుని ప్రాంతానికి చెందిన అజయ్‌, గాజువాకకు చెందిన శ్రీనాథ్‌ పరీక్ష రాసేందుకు పరుగు పరుగున కేంద్రం వద్దకు వచ్చారు. ఆలస్యమైపోయిందని గేటు తెరవాలని సిబ్బందిని బ్రతిమిలాడారు.

దీంతో అక్కడి సిబ్బంది ఈ విషయాన్ని పరీక్ష నిర్వాహకులకు తెలిపారు. వారి సూచనతో అభ్యర్థులను పరీక్షకు అనుమతించారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo