News

Realestate News

36,944 మందికి గ్రూప్‌ – 2 పరీక్ష

group-2 exam people strength 36,944


36,944 మందికి గ్రూప్‌ – 2 పరీక్ష

 

అధికారులతో సమావేశమైన డీఆర్వో గున్నయ్య

 ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న గ్రూప్‌-2 పరీక్షకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఆర్‌.గున్నయ్య ఆదేశించారు.

జిల్లాలో 106 కేంద్రాలను ఏర్పాటు చేశారని, 36,944 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. గతానుభవనాలను దృష్టిలో ఉంచుకొని తప్పిదాలకు అవకాశం లేకుండా పరీక్షను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.

శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో పరీక్ష కేంద్రాల పర్యవేక్షకులు, లైజాన్‌ అధికారులతోను, కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వేర్వేరుగా సమావేశమై సమీక్షించారు.

ఏపీపీఎస్‌సీ అధికారులు, పరీక్షల విభాగం పర్యవేక్షకులు పి.వి.రత్నం, ఆర్టీసీ, జీవీఎంసీ, పోలీసు, ఆరోగ్యం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

గంటముందే చేరుకోవాలి..: పరీక్ష సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు. అభ్యర్థులంతా నిర్ణీత సమయం కంటే గంట ముందే అంటే ఉదయం 9 గంటలకే కేంద్రానికి చేరుకోవాలి.

నిర్ణీత సమయంకంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అనుమతించబోమని గున్నయ్య స్పష్టం చేశారు.

రేపు 106 కేంద్రాల్లో నిర్వహణ

సదుపాయాల కల్పన..: పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని డీఆర్‌వో సూచించారు.

నిరంతర విద్యుత్తును సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని, వాటి చుట్టుపక్కల ఉన్న జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయించాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo