News

Realestate News

జాతీయ విలువిద్య పోటీల్లో స్వర్ణపతకం

Gold medal national archery competitions.


జాతీయ విలువిద్య పోటీల్లో స్వర్ణపతకం


అర్చరీబౌల్‌తో గణేష్‌ మణిరత్నం

పి.బోనంగి సంస్కృతి గ్లోబల్‌ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి టి.గణేష్‌ మణిరత్నం ఈ నెల 13 నుంచి 16 వరకు కడపలో స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన అండర్‌-14 జాతీయస్థాయి విలువిద్య (ఆర్చరీ) పోటీల్లో ప్రధఫఫమస్థానంలో నిలిచి స్వర్ణపతకం సాథించాడు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించి విలువిద్య కాంపౌండ్‌ విభాగంలో ఈ ఘనత సాధించినట్లు ప్రిన్సిపల్‌ సీతాలక్ష్మి తెలిపారు. ఇతని స్వస్థలం నెల్లూరు జిల్లా నాయుడుపేట.

పి.భోనంగి పాఠశాలలో విలువిద్య సాధనకు మంచి సౌకర్యాలు ఉండడంతో ఇక్కడ చేరి రోజుకు 3 గంటలపాటు కఠోర సాధన చేస్తూ పతకాలను కైవసం చేసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

స్వర్ణం సాధించిన గణేష్‌తో పాటు కోచ్‌ను గురువారం పాఠశాల చైర్మన్‌ పి.సూర్యనారాయణరెడ్డి, సీఈవో నిశాంత్‌ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.