గేమ్ డెవలప్మెంట్పై వేసవి శిక్షణ

గేమ్ డెవలప్మెంట్పై వేసవి శిక్షణ
బ్రోచర్‌ను విడుదల చేస్తున్న డైట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగప్రసాద్
పట్టణంలోని డైట్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో డైట్ కళాశాలలో త్రీడీ గేమ్ డెవలప్మెంట్పై వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు గేమ్ఫికేషన్ బ్రోచర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజినీరింగ్ మూడో, నాలుగో సంవత్సరం చదువుతున్న కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఈ కోర్సులో శిక్షణ అందిస్తామన్నారు.
మే 28వ తేదీ నుంచి జూన్ 2 వరకు నిర్వహించే శిక్షణలో 200 మంది విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు కళాశాలల్లో ఈ శిక్షణ ఇస్తుండగా దీంట్లో డైట్ ఒకటన్నారు.
ఈ కోర్సులో విస్తృత ఉద్యోగావకాశాలు ఉన్నాయని కోర్సు కో-ఆర్డినేటర్, సీఎస్ఈ విభాగపతి డాక్టర్ ఎల్ ప్రసన్నకుమార్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఎస్.ఈశ్వరరావు పాల్గొన్నారు.