News

Realestate News

జనవరి 1 నుంచి అన్ని పథకాలకు ఆధార్‌

From January 1, all of the projects in the Aadhaar, viskhapatnamrealestate news

వన్‌టౌన్‌ :

వచ్చే జనవరి 1 నుంచి అన్ని పథకాలకు ఆధార్‌ను అనుసంధానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి ఆయన జిల్లా అధికారులతో దూరదృశ్య సమావేశం(వీడియో కాన్ఫరెన్స్‌) నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. ప్రజాసాధికారిక సర్వే సత్వరమే పూర్తిచేయాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో మైదాన ప్రాంతంలో 95శాతం, గిరిజన ప్రాంతంలో 36శాతం, నగరంలో 79శాతం సర్వే పూర్తయిందన్నారు. మిగతా వివరాల నమోదుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరంలో పోర్టు, విశాఖ ఉక్కు, నౌకాదళ ఉద్యోగులు అధికంగా ఉన్నారని, వారు సర్వేకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయమై ఆయా విభాగాల ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడామని వివరించారు. సర్వే సక్రమంగా చేయనటువంటి 14 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశామని, మరో 60 మందికి తాఖీదు(షోకాజు నోటీసు)లు జారీ చేశామని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌, జేసీ సృజన, ఐటీడీఏ పీఓ రవి పట్టన్‌శెట్టి, డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్‌ఐసీ శాస్త్రవేత్త పాషా, తదితరులు పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo