News

Realestate News

టెక్‌ మహీంద్రలో ఉచిత శిక్షణ

Free training at Tech Mahindra Development.


టెక్‌ మహీంద్రలో ఉచిత శిక్షణ

టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, ఎం.బి.ఎ, ఎం.సి.ఎ, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈనెల 28వ తేదీన వెబ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో ఉపాధి అవకాశాలపై ఒక రోజు ఉచిత కార్యశాల నిర్వహిస్తున్నట్లు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పి.ఎల్‌.కె.మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యశాలలో పాల్గొనదలచిన అభ్యర్థులు టెక్‌ మహీంద్ర స్మార్ట్‌ అకాడమీ ఫర్‌ డిజిటల్‌ మీడియా విభాగంలో లేదా 73373 34599 నెంబరుకు ఫోనులో సంప్రదించాలని సూచించారు.


రాయితీపై ఆప్కో వస్త్రాలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కో ద్వారా విక్రయించే చేనేత వస్త్రాలపై 50 శాతం రాయితీ ప్రకటించినట్లు ఆ సంస్థ డి.ఎం.ఒ. జగదీశ్వరరావు తెలిపారు. సిరిపురం వి.ఎం.ఆర్‌.డి.ఎ. కాంప్లెక్సులో ఉన్న ఆప్కో షోరూంలో జులై 25 వరకు అన్ని రకాల చేనేత వస్త్రాల అమ్మకాలు జరుగుతాయన్నారు.

ప్రధానంగా పోచంపల్లి, గద్వాల్‌, కంచి, ధర్మవరం చీరలు, బెడ్‌షీట్లు, తువ్వాళ్లు, మ్యాట్లు, రెడీమేడ్‌ తదితర వస్త్రాలపై 50 శాతం రాయితీ ఉందన్నారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమ్మకాలు కొనసాగుతాయన్నారు.