ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ

విజేతగా గీతం టెక్నాలజీ విభాగం జట్టు
సాగర్‌నగర్:
గీతం వర్సిటీ వైద్య కళాశాల మైదానంలో జరుగుతున్న అంతర్‌కళాశాలల క్రీడా పోటీల్లో భాగంగా సోమవారం జరిగిన ఫుట్‌బాల్ ఫైనల్స్‌లో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశాఖ జట్టు విజయం సాధించిందని వీసీ ఆచార్య ఎం.ఎస్.ప్రసాదరావు తెలిపారు. ఫైనల్స్‌లో సంబంధిత జట్టు గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ (హైదరాబాద్) జట్టుపై 3 -1 గోల్ü్సతో గెలుపొందిందన్నారు.
విజేత జట్టు క్రీడాకారుడు విక్రమ్‌జిత్‌సింగ్ తుదిదశలో చేసిన 2 గోల్స్ విజయానికి దోహదపడిందన్నారు. ఈ జట్లలో చురుకుగా పాల్గొన్న క్రీడాకారులను దక్షిణాది రాష్ట్రాల అంతర్ వర్సిటీల పోటీల్లో పాల్గొనే జట్టులోకి ఎంపిక చేస్తామని క్రీడావిభాగం కార్యదర్శి కె.రామకృష్ణారావు, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేత జట్టు సభ్యులను వీసీ తదితరులు అభినందించారు.